Skip to product information
Screenplay
1/2

Screenplay

Rs. 225.00

సుజాత సార్ నాకు స్కూల్ రోజుల నుంచే తెలుసు. ఓ పాఠకుడిగా ఆయనవి ఎన్నో కథలని చదివాను. చాలా కథలు నాకెంతో ఇష్టం కూడా. ముఖ్యంగా కొన్ని చిన్నకథలు. మేమిద్దరం కలిసి 4 సినిమాలు రాశాం - ‘రోజా’, ‘తిరుడా తిరుడా’ (దొంగ దొంగ)’, ‘దిల్ సే’, ‘అమృత’. ఓ దర్శకుడికి ఉండే శైలిని ఆయన అర్థం చేసుకోగలగడం వల్ల, ఆయనతో పని చేయడం ఆనందంగా ఉండేది. కానీ నన్ను ఎప్పుడూ ఆశ్చర్యానికి గురిచేసేది – ‘ఎన్నెన్నో విభిన్నమైన విషయాల గురించి రాయగలిగే ఆయన శక్తి.’ అంతా తెలిసివుండవచ్చు, తెలిసినదాన్ని మాట్లాడవచ్చు, కానీ వాటిని కలం పట్టి కాగితంపై సజావుగా వ్రాయడం అంత సులభం కాదు. దీనికి స్పష్టమైన ఆలోచనతో పాటు, పాఠకుడి మనసు దోచుకునే శైలి అవసరం. ఈ స్క్రీన్ప్లేపుస్తకం నన్ను ఆశ్చర్యపరిచింది. స్క్రీన్ప్లేనిర్మాణం, దాని మూలతత్వాన్ని ఇలా స్పష్టంగా, అర్థమయ్యేలా ఆయన రాయగలిగారు. నేను నా మొదటి సినిమా తీసే సమయానికి ఈ పుస్తకాన్ని ఆయన ఎందుకు రాయలేదు? భారతీయ సినిమాకి, భారతీయ స్క్రీన్ప్లేలకు ఎన్నాళ్లుగానో ఉన్న లోటుని తీర్చే తొలి అడుగు ఇదే, పెద్ద అడుగు కూడా ఇదే. --మణిరత్నం

You may also like