
POTTELU
మనుషులు ఏకాంతాన్ని కోరుకోవచ్చు కానీ, ఎప్పటికీ ఒంటరి కాలేరు. తనకు తానుగా ఏదో ఒక బంధాన్ని వెతుక్కుంటారు. సత్యం పొట్టేలుని వెతుక్కున్నట్టు. కాశినాయన క్షేత్రంలో తనని తాను వెతుకున్నట్టు. దూరమైన మనుషుల స్థానంలో ఆ ఖాళీని పూర్తి చేసే మరేదైనా నింపాలనే తపన ఉన్నంత వరకూ మనుషులు ఒంటరిగా ఉండలేరు. సొంత నేల మీద నుంచి ఓ పిలుపు వెంటాడుతూనే ఉంటుంది. తల్లీ కొడుకులుగా పైకి కనిపించే కథ మార్మికంగా ఈ ప్రకృతికీ మనిషికీ ఉండే లోతైన అనుబంధాన్ని చెబుతుంది. నవలలో అమెరికా వలస అనేది కేవలం జియోగ్రాఫిక్ మార్పు కాదు, పొట్టేలు కేవలం ఒక జంతువు కాదు. మహిళా రైతుగా, తల్లిగా వేదన పడే సత్యం, మల్లేష్ ఒకడికే తల్లి కాదు. మానసికంగా సొంత నేలనీ, కోల్పోతున్న అనుబంధాలనీ గుర్తు చేసే ప్రతీకలు. తాత్వికతా, వాస్తవికత కలిసిపోయిన ఈ "పొట్టేలు" తెలుగులో మరో అద్బుతమైన రచనగా నిలుస్తుంది. - నరేష్కుమార్ సూఫీ