Skip to product information
Ontaritanapu Kathalu
Rs. 200.00
ఇది మానవ సంబంధాలు అర్థం చేసుకోలేక ఎదురైన ఒంటరితనం కావొచ్చు. ఆ మానవ సంబంధాలు పూర్తిగా అర్థమయ్యాక మనలో పుట్టే ఒంటరితనం కూడా అయ్యుండొచ్చు.
నగరజీవితంలోని సాయంత్రాల్లో ఒక రకమైన మెలంఖలీ ఉంటుంది. అందులోకి జారిపోతే ఎప్పుడో అర్ధరాత్రుల్లో తేలుతాం. ఆ మెలంఖలీని, నగరజీవితపు ఒంటరితనాన్ని, గత కాలపు చెదిరిన ఙ్ఞాపకాలని ఒక చోట చేర్చే ప్రయత్నమే ఈ పుస్తకం.
ఈ కథల్లో మీ జీవితపు సాయంత్రమో, రాత్రో, మనిషో, ఙ్ఞాపకమో మీకూ దొరికితే, ఒక్కసారి చిన్నగా నవ్వుకుని ‘రేపటీగీతం’ కోసం వెతకండి. అదే దారిలో ఎక్కడో ఒక చోట నేనూ కనిపిస్తాను.
-మొహమ్మద్ గౌస్