Skip to product information
Nallagonda Kathalu
1/2

Nallagonda Kathalu

Rs. 200.00

Nallagonda Kathalu - Stories from a small town childhood – by V Mallikarjun. గట్టిగ తిరిగితే ఒక ఇరవై నిమిషాలల్ల మా ఊరు చూశుడు అయిపోతది. ‘అర్బనూరు’ అని నేనొక కథ కోసం కనిపెట్టిన పదం మా ఊరిని చూసి పెట్టిందే. అచ్చంగా అట్లనే ఉంటది మా ఊరు. సిటీకి ఊరులెక్క. ఊరికి సిటీలెక్క. నేను మా ఊరి గురించి, మా ఊరి మనుషుల గురించి, మా నాన్న గురించి, మా అమ్మ గురించి చెప్పాల్నని చానా రోజుల్నించి అనుకుంటున్న. చెప్తానికి చానా కథలున్నయి సరే, అయి ఎట్ల చెప్పాలి? ఏది కథ అయితది? ఈ జ్ఞాపకాలు, ఇష్టాలన్నీ పోగేసి ఏం కథ రాయాలి? ఇదంత నా మెదడుల తిరుగుతనే ఉండె. మొత్తానికి కొన్ని కథలు దొరికినయి. వాటి గురించి ఆలోచించుకుంట ఈ కథలు రాస్తుంటె నాకు నేను దొరుకుతనే ఉన్న. ఒక్కసారి గతాలకువోతే మనకు మనం గుర్తొస్తమంటే ఇదే. ఇయి రాస్తుంటే నన్ను నేను మళ్లా దోలాడుకుంటున్నట్టు, నాకు నేను మళ్లా దొరుకుతున్నట్టు అనిపిచ్చింది. మీగ్గూడ అట్లనే అనిపిస్తదా లేదా చెప్పలేను. సదివి మీరే చెప్పాలి. -వి. మల్లికార్జున్‌

You may also like