Skip to product information
Madhusala

Madhusala

Rs. 100.00

'మధుశాల’ మత్తెక్కిస్తుంది. అలసిన ఆత్మలను ఆదమరపించి, అంతర్లోకాల సందర్శనం చేయిస్తుంది. శుష్కవచనం కవిత్వంగా చలామణీ అవుతున్న తెలుగునేల మీద– ఆరుతడి కవిత్వమే అపురూపంగా మారిన రోజుల్లో తన గుండెతడినే కవిత్వంగా మలచి మధువొలకబోశారు అనిల్ బత్తుల.

‘మధుశాల’లలోని కవితలు పురాతన మధువులాంటి పరిమళంతో చదువరులను మత్తెక్కిస్తాయి. మైకం, మోహం జమిలిగా జుగల్బందీ చేసిన కవితలివి. జీవన బీభత్సాన్ని సుందరమైన మధుపాత్రలో దర్శింపజేసే కవితలివి. మత్తెక్కించినట్లే ఎక్కించి, చెర్నాకోలతో చరిచినట్లుగా ఒక్కసారిగా మత్తొదిలించే కవితలూ ఇందులో ఉన్నాయి.

‘అప్పుడు నా వయసు పన్నెండు గొర్రెలు కాచే పేద నల్లపిల్లను/ మా గ్రామదేవతలా చక్కటి కళ నా మొహంలో ఉండేది/ సమర్తాడిన వారానికి మా ఇంటి పక్కావిడ నా కన్నెరికాన్ని లక్షరూపాయలకు/ మా ఊరి వర్తకుడికి అమ్మేసింది/ ఆ రాత్రి నాకు చేరిన నా రక్తపు ముద్ద విలువ రెండువేలు మాత్రమే’...

ఎంతటి బీభత్సం! లోకంలో ఇలాంటి బీభత్సం సర్వసాధారణం. యాంత్రికలోకంలోని సర్వసాధారణ బీభత్సాన్ని తట్టుకోవడం సున్నితహృదయులకు దుస్సాధ్యం. తట్టుకోవాలంటే ‘మధుశాల’లోనికి అడుగుపెట్టాల్సిందే!
-Panyala Jagannatha Das

You may also like