
Long March - A Novel
ఎవరు చదివినా చదవకపోయునా కాలం నిజాయితీగా తన చరిత్రను తాను రాసుకుంటూనే ఉంటుంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలను మైలురాళ్లుగా వేసుకుంటూనే ఉంటుంది. అలాంటి మైలురాళ్లలో ఒకటి తెలంగాణ మలిదశ ఉద్యమంలోని ’మిలియన్ మార్చ్’. అప్పటికి సహాయనిరాకరణతో ఊరూరు అట్టుడుకుతుంది. ట్యాంక్ బండ్ మీద ’మిలియన్ మార్చ్’ చేసి తను ఆకాంక్షను బలంగా చెప్పాలని ఉక్కుపాదం మోపి అనుమతికి నిరాకరించింది. అయినా భయపడకుండా జనం ముందుకు కదిలారు. అరెస్టుల్య్, బారికేడ్లు, ఇనుపకంచెలు, పోలీసులను దాటుకుని, దెబ్బలుతిని, రక్తమోడుతూ ట్యాంక్ బండ్ ను ముద్దాడారు. కడుపుమండి కనబడిన విగ్రాహాలను నేలకూల్చారు. అనుకూలంగా వత్తాసు పలికే బాకాలను ఎత్తి ట్యాంక్ బండ్ లోకి విసిరికొట్టారు. ఒకరు పిలిచింది కాదు, ఒకరు రమ్మని ఒత్తిడి చేసింది లేదు. పల్లెపల్లె నుంచి గుంపులు గుంపులుగా సామాన్య జనం అవరోధాలను దాటుకుని పట్నం చేరుకున్నారు. దీనికి స్ఫూర్తి ఏమిటి? అప్పటి పల్లెప్రజల మానసికస్థితి ఎలా ఉంది? ఉద్యమ భావజాలవ్యాప్తి ఇల్లిల్లుకు ఎలా చేరింది? ఇలాంటి అనేక విషయాలను చర్చించిన నవల ఈ "లాంగ్ మార్చ్".