Skip to product information
Kalalu
Rs. 150.00
తన చుట్టూ ఉన్న సమాజాన్ని దాటి ఏ కవి అయినా కవితా వస్తువును ఎంచుకోలేడు. అదే వనమాలలో చూడవచ్చు. రైతు గురించి తల్లి గురించి భ్రూణహత్యల గురించి ఆయన ఒకే గొంతుతో మాట్లాడతారు. తన గొంతులో ఎంత ఆవేశం ఉన్నా, అది అక్షరాల్లోకి వచ్చేసరికి సున్నితంగా మారిపోతుంది. అందుకే "అంటుగట్టి లక్షల కొమ్మలను పెంచుతాడే/ వేరు తానైనా ఎదగలేక ఒదిగి ఉన్నా/ రెక్కలుడిగి వేరుగానే తాను మిగిలిపోయాడే.../ పగిలిపోయాడే" అంటాడు. వేరు అనే పదం రెండు చోట్ల వాడటం ద్వారా శ్లేషగా రైతు దీన స్థితిని చెబుతాడు. కవిలో కదిలే గుణం లేకపోతే తాను ఎంచుకున్న అంశాల్లోకి ఆర్ద్రత రాదు. ఆ చలింపు ఈ కవిలో ఉండబట్టే తను రాసిన కవితల్లో ఆర్ద్రత చోటు చేసుకుంది.