Skip to product information
Itlu.. Nee Preyasi - A Novel
Rs. 275.00
ముందుగా.. ఈ పుస్తకం చదివాక దానితో వొచ్చే ఇన్లాండ్ లెటర్లో మీరో అందమైన ప్రేమలేఖ రాసి పంపాలి.. అడ్రసు ఆ లెటర్ పైనే ఉంది.. ఇక కథకొస్తే.. "నేనేమో వెన్నపూసని.. విచ్చుకుంటున్న పువ్వు రెక్కలు గాలికి చెదిరి రాలిపోతే బాధతో కరిగిపోయేదాన్ని.. పుప్పొడిని భద్రంగా దాచుకుని ఒక తరాన్ని, కనీసం జ్ఞాపకాన్ని నిలుపుదామని ఆశపడేదాన్ని.." ఇలాంటి ఒక రాధ.. "నువ్వేమో బండరాయివి.. ఎవరో ఉలితో శ్రద్ధగా చెక్కిన శిల్పానివి.. కళ్ళు, చెవులు, కాళ్ళు, చేతులే తప్ప మనసు, మెదడు గురించిన ఆనవాళ్ళు భూతద్దం పెట్టి వెతుక్కోవాల్సిన శరీరం అది.." అలాంటి ఒక శ్యాం.. భద్రాద్రి రాముడి గుడిగంటలు, పాపికొండలమధ్య పారే గోదారి ఇసుకతిన్నెలు, పాల్వంచ పవర్హౌజు కార్మిక యూనియన్ పోరాట నినాదాల సాక్షిగా జరిగిన ఒక అందమైన ప్రేమకథ..