
Gundelo Vana
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావు పేట మండలం భీముని మల్లారెడ్డి పేట గ్రామంలో పుట్టారు. ఎం.ఏ. తెలుగు, ఎంఎస్సీ గణితం, బి.ఎడ్. పూర్తి చేసి గణిత ఉపాధ్యాయులుగా స్థిరపడ్డారు. గ్రామంలో తమ పాఠశాల పనితీరు పై రెఫరెండం పెట్టుకుని సంచలనం సృష్టించారు. సీనియర్ సిటిజన్తో పాఠశాలలో ప్రవేశపెట్టిన 'అనుభవ పాఠాలు' ఒక కొత్త ప్రయోగం. 'పాఠశాలనే నా ప్రయోగశాల. మా ఊరే నా కథల కార్యశాల' అని చెప్పుకునే పెద్దింటికి పిల్లలకు పాఠాలు చెప్పడమన్నా కథలు రాయడమన్నా చాలా ఇష్టం. " 1999 నుండి రచనారంగంలోకి వచ్చారు. మొదటి కథ ‘ఆశ-నిరాశ ఆశ' ఆంధ్రప్రభ ఆదివారంలో అచ్చయింది. ఇప్పటివరకు 250 కథలు, 7 నవలలు, 100 వ్యాసాలు, 4 నాటకాలు రాసారు. 8 కథా సంకలనాలు వెలువరించారు. ఈయన కథల్లో తెలంగాణ పల్లె కళ్లముందు కదులుతుంది. చక్కటి శైలి మంచి కథా శిల్పంతో అరుదైన వస్తువులను తీసుకుని ఆగకుండా చదివించేలా రచన చేస్తారు. కథలు రాయడం పై వివిధ యునివర్సిటీలలో, డిగ్రీ కాలేజీలలో వర్క్ షాపులు నిర్వహించారు. పెద్దింటి సాహిత్యం పై ఇంతవరకు ఆరు ఎం.ఫిలు, మూడు పీ హెచ్ డీలు వచ్చాయి. ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి.