Skip to product information
DIGANTHAM
1/2

DIGANTHAM

Rs. 200.00

ఏ ముఖమూ లేని నేను నా ముందు పరిగెత్తుతున్నాను. ముఖమే లేని యింకో నేను... నన్నే తరుముకుంటున్నాను. ముందు పరుగెత్తే నేనూ.... వెనక తరిమే మరో నేనూ... నా నేనులు వేటాడేదీ వెంటాడ్తోన్నదీ. గాలిస్తున్నది.... ఎక్కడో కోర్కెల దొమ్మీలో... ఏవో ఆశల తొక్కిసలాటలో పారేసుకున్న ముఖాన్నే... మనిషి ముఖాన్నే... ఎంతకీ దొరకదా ముఖం... ఎక్కడో దూరంగా దిగంతం దగ్గర లీలగా కనీ కనబడకా.... మభ్యపెడ్తుంది.... అలా... అలా... అనేకమైన నేనులుగా చీలిపోయి, చిట్లిపోయి, చెదిరిపోయి నిజముఖ లాలసతో పరిగెడుతూ... పరిగెడ్తూ.. అలసిపోయి... ఉన్నట్టుంది మెట్లు. ఎక్కుతున్నాను... ఎక్కుతున్నాను... ఎక్కుతూనే వున్నాను.... యెంతకీ మెట్లు మాయం కావు.... - కాశీభట్ల వేణుగోపాల్

You may also like