
Cinema Cinema Cinema
’కేరాఫ్ కంచరపాళెం’, ’మల్లేశం’, ’ఈ నగరానికి ఏమైంది’, ’దొరసాని’ లాంటి ఎన్నో కొత్తతరం తెలుగు సినిమాలకు సహ నిర్మాతగా పని చేసిన వెంకట్ శిద్దారెడ్డి సినిమాల్లోనే కాకుండా సాహిత్యంలో కూడా కొత్త దారులు వెతుకుతున్నారు. ఆన్వీక్షికి పబ్లిషర్స్ ద్వారా రెండేళ్లలో యాభై పుస్తకాలు ప్రచురించారు. సినిమా, సాహిత్యం చేతులో చెయ్యి వేసుకుని నడవాలని ఆకాంక్షిస్తూ అటు సినిమా రంగంలో, ఇటు సాహితీ రంగంలో కూడా కొత్త ఆలోచనలను ఆచరణలో పెడ్తున్న వెంకట్ శిద్దారెడ్డి ’సోల్ సర్కస్’, ’సినిమా ఒక ఆల్కెమీ’, ’సినిమా కథలు’ పుస్తకాల తర్వాత వస్తున్న ఈ కొత్త పుస్తకంలో ఒక ప్రపంచమే ఉంది. ప్రపంచం నలుమూలలకు చెందిన సినిమాలు, దర్శకులు, సినిమా నిర్మాణంలోని వివిధ విషయాలకు సంబంధించిన వ్యాసాలు ఇందులో ఉన్నాయి. ప్రతి సినీ ప్రేమికుడు తప్పక చదవాల్సిన పుస్తకం ఇది. ఈ 'సినిమా సినిమా సినిమా'లో వెంకట్ శిదారెడ్డిది లీనమైన త్రిపాత్రాభినయం. వొకటి: చూసే సినిమా పిచ్చోడు టోటో రెండు: చూపించే సినిమా పిచ్చోడు ఆల్ఫ్రెదో మూడు: తీసే సినిమా పిచ్చోడు సాల్వతోర్ ది విటా. అనంతు చింతలపల్లి.