
Anandamaye Sakhi
Anandamaye Sakhi - A Telugu Novel By Srujana Vavilapalli
నీలోకి, నాలోకి, మనందరిలోకి, తొంగి చూస్తే ఒకే కథ కనిపిస్తుంది. కానీ వాటికి మనం స్పందించే తీరు వేరుగా ఉంటుంది. ఒక మాటని నువ్వు ఎంత లోతున దాచుకుంటావో, ఒక కష్టానికి నేను ఎంతలా విరిగిపోతానో, గుప్పెడు ఆనందానికి తను ఎన్ని గంతులేస్తుందో, ఇదంతా ఎవరికి వాళ్ళే తెలుసుకునే సంగతి. నీలా నేను మారలేను. నాలా నువ్వు ఉండలేవు. కానీ మన విరుద్ధ భావాలను ఒకే వంతెనపై నడిపించగల శక్తి స్నేహానికి ఉంది. ఆ స్నేహం తాలుకు అవసరం అందరిలాగే స్త్రీకి ఉంది. ఏదో సాధించడానికి కాదు, ఎక్కడికో ఎగిరిపోవడానికి కాదు. తనకి తను మిగలడానికి, తనని తనకు మిగుల్చుకోవడానికి- ఈ పరిచయాలు, స్నేహాలు, నమ్మకాలు, ప్రేమలు, వీటన్నింటి కలబోతే ఈ నవల. అవును! “నీలో ఆకాశమంత వెలుగు చూసేందుకు, ఆమె ఒక మబ్బు తునకై తప్పక నీ వెంట వస్తుంది.”