
Aarella Prema
ప్రేమ ఒక్కొక్కరిలో ఒకలా ఉంటుంది. ప్రేమించడం, ప్రేమించబడంలో అమాయకత్వం ఎంత ఉండాలో, ఆ ప్రేమ అందకుండా పోతున్నప్పుడు అంతే మెచ్యూరిటీ ఉండాలి. ఈ రెండూ ఆయా సమయాల్లో లేనపుడే జీవితాలు గతితప్పుతాయి. ఈ నవల చదువుతున్నప్పుడు... ఎప్పుడో ఎవరో మనకు గుర్తుగా ఇచ్చిన ఓ చిన్న నెమలీకో, ఇంకెవరి గుర్తుగానో దాచుకున్న ఙ్ఞాపకమో మనసుని తడుతుంది. మనిషిని కోల్పోయిన బాధ మెలితిప్పుతుంది. ప్రేమంటే ఇవ్వటమే కాదు, దూరాన్ని అంగీకరించటం, జీవితాన్ని ప్రేమించడం అనే విషయాన్ని కీర్తి ఇనుగుర్తి ఇంత సులభంగా చెప్పిన తీరు ఆశ్చర్యంగా అనిపించింది. కొత్తతరం ఏమైపోతుందా అనిపించినప్పుడు. వాళ్లకి ఇచ్చే బహుమతుల్లో ఈ పుస్తకం కూడా ఉండాలి. పిల్లలకి జీవితాన్ని ప్రేమించడం కూడా తెలియాలంటే... ఈ కథ చదవాలి. - నరేష్కుమార్ సూఫీ Replacement available only if the book is received damaged, misprinted, or wrong edition. No returns for change of mind.