
96 A REAL LIFE LOVE STORY
ఇదొక రియల్ లైఫ్ లవ్ స్టోరీ. వేసవికాలం, పౌర్ణమిరాత్రి ఆరుబయట మంచం వేసుకొని ఆరామ్సే వెళ్ళకిలా పడుకొని ఆకాశంలో మెరిసే నక్షత్రాల్ని, ముద్దుగా వెలిగే చందమామని చూస్తూ, చుట్టూ పాలపొంగులా పరుచుకున్న వెన్నెల్లో తడుస్తూ బామ్మో, తాతయ్యో, అమ్మో, నాన్నో, తోబుట్టువులో, ఫ్రెండ్సో, చెప్పే కబుర్ల కథల్ని వింటున్నంత హాయిగా సాగుతుంది ఈ కథ! స్నేహం, ప్రేమ, ఫ్యూచర్, ఫ్యామిలీ, కెరీర్, కలలూ, ఇష్టాయిష్టాలు ఇలా ప్రతీ విషయంలోనూ ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఎలా ఆలోచిస్తారు? టీనేజ్లో కలిగే భావోద్వేగాల పరిణామాలు ఎలా ఉంటాయి? ఏ రిలేషన్లోనైనా ఉండాల్సిన లిమిటేషన్స్ ఏంటీ? ఒకరితో ఒకరు గౌరవంగా, స్నేహంగా, మెచ్యూర్డ్ గా ఎలా మసులుకోవాలి? ఇలాంటి విషయాల గురించి, ఇందులో ముఖ్యపాత్రలైన ఒక అమ్మాయీ, అబ్బాయీ వారి ఫీలింగ్స్ ్న, కథలోని మూమెంట్ని, వారి వారి దృక్కోణం నుంచి మీతో పంచుకుంటూ, ఈ ఇద్దరూ మీ చెరోచేతిని పట్టుకొని మొదటి పేజీ నుండి చివరి పేజీ వరకు ఒక్క క్షణం కూడా మిమ్ముల్ని వదలకుండా ప్రతీ జ్ఞాపకాన్ని, అనుభవాన్ని దృశ్యరూపంలో మీ కళ్ళ ముందుంచుతారు. తొలి ప్రేమ ఇచ్చే తీపి, చేదు జ్ఞాపకాలతో, ఎన్నో ఎమోషన్స్, మరెన్నో మలుపులతో ఎక్కడా బోర్ కొట్టకుండా ఆద్యంతం నాన్స్టాప్ ఎంటర్టైయిన్తో రోలర్ కోస్టర్లా సాగే ఈ కథని సాంతం చదివాక ఒక మంచి పుస్తకాన్ని చదివామనే సంతృప్తిని మీకు తప్పకుండా ఇస్తుందని హామీ ఇస్తూ, మీకు ఈ "Come back to book revolution"s సపోర్ట్ చేయగలరని కోరుకుంటూ... థాంక్యూ...