Skip to product information
16 Toli Prema Kathalu
Rs. 200.00
ఈ కథలన్నీ కాలాల మీదగా వీచిన హాయితనపు గాలులు కాదు. వీటిలో ఈదురు గాలులున్నాయి, ఇప్పటికీ ఎదల్ని కోస్తోన్న అంతుపట్టని సమాజపు సజీవావవశేషాల ఛాయలున్నాయి. ముళ్ళకంపల మీదగా నడిచొచ్చిన పాదాలు భద్రంగా దాచుకున్న గాయాల తాలూకా ముద్రలున్నాయి. పసివయసులో ఒక్కోరూపాయినీ ముంతలో వేసుకున్నట్టే... ఆనందాలనీ, ఆశ్చర్యాలనీ, నిరంకుశత్వాన్ని మోసిన నిర్మాలత్వాలనీ, కళ్ళల్లో అట్టే పెట్టుకున్న కన్నీళ్లనీ, అంటి పెట్టుకున్న పసితనపు ఆరోమా వాసన్లనీ, కొనసాగుతోన్న కౌమారపు కలల కార్యాల లోలకపు కంపానల ఆవర్తనాలనూ, శిథిల జ్ఞాపకాల పుటల మీద కొత్త జీవితాలను నిర్మించుకుంటున్న కోట నీడల రెపరెపల పాటలనూ ఈ పుస్తకం సాక్షిగా వలపోసుకున్నారు.