Skip to product information
Swatantra (స్వతంత్ర)
1/2

Swatantra (స్వతంత్ర)

Rs. 200.00

“ఒకసారి చెప్తే అర్థం కాదూ? నీలాంటి ఆడాళ్ళు ఉన్నంతలో ఉంటే మంచిది” అతడి మాట కచ్చితంగా అతడి హృదయం నుండి ప్రతిధ్వనిస్తుంది. ‘నా లాంటి ఆడాళ్ళా? అంటే నేనేం చేసాను? ఈయన ఎందుకిలా అంటున్నారు? ఉన్నట్టుండి ఇంత చిత్రమైన మాటెందుకు పలికారు. ఆయన ఉద్దేశ్యమేమిటి? ఇష్టం లేకుంటే లేదని చెప్పాలిగానీ ఈ మాట ఊరికే ఎలా అనగలిగారు?’ ఆమెలో ఆవేదన తన్నుకొస్తూ “నేనేం చేశాను? ఎందుకలా అంటున్నారు?” అడిగింది కన్నీళ్ళ భారానికి బరువైన గొంతు సరిచేసుకుంటూ. “మీ ఆడాళ్లకు పాపులారిటీ పెరిగితే కళ్ళు నెత్తికెక్కుతాయి. మొగుడూ పిల్లలూ ఇవేం మీకు అవసరం ఉండదు. అందుకే ఈ చెత్త ఐడియాలు పక్కన పెడితే మంచిది. లేకుంటే అనవసరంగా నీ గొయ్యి నువ్వు తీసుకుంటావు” అతడి మాటలు కటువుగా ఆమె హృదయంలోకి చేరుకున్నాయి.

You may also like