Skip to product information
Sontha Ooru

Sontha Ooru

Rs. 150.00

మా సొంత ఊరు క్రాకుటూరు, పేరు చదవడానికి చిత్రంగా ఉన్నా , వినసొంపుగా ఉంటుంది మా ఊరి మనుషుల మాటల్లాగా. చూడటానికి షుమారుగా ఒక వంద నుంచి నూట యాభై గడపల పల్లెటూరే, కానీ పలికే ప్రతి మాటా, పెదాల పైనుంచి కాకుండా కడుపులోంచి వస్తుంది. అటువంటి ఊళ్ళో, అటువంటి మనుషుల మధ్య పెరిగిన నేను. నేను చూసిన, నాకు ఎదురైన సంఘటనలకు అక్షర రూపమే ఈ సొంత ఊరు కథలు. ప్రతి ఇంట్లో మనుషులతో సమానంగా, ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువగానే చూసుకునేది మా పశువుల్ని , జివ్వాల్నే. ఇంట్లో ఎవరికైనా కాలికి ముల్లు గుచ్చుకుంటే, ముళ్ళ దగ్గరికి ఎందుకు పోయినవ్ అని కసురుకుంటారు అదే మందలో ఒక గొర్రి కాల్లో ముల్లు గుచ్చుకుంటే కీలకత్తి పెట్టి దాన్ని జాగ్రత్తగా తీసి, కిరసనాయిలు పోసి కడిగి, గాయపాకు తెచ్చి కట్టు కట్టి అది మానేంత వరకూ బిడ్డకంటే జాగ్రత్తగా చూసుకుంటారు. అది మా ఊరి మనుషులకూ, జివ్వాలకీ మధ్య పెనవేసుకున్న బంధం. ఎంత చెప్పినా తక్కువే మా ఊరి మనుషుల గురించి, వాళ్ళ మనసుల గురించి. మా ఊళ్ళోనే కాదు. మీ సొంత ఊళ్ళో కూడా, పొట్టేలును ప్రాణంగా చూసుకునే గంగయ్య లాంటి మట్టి మనిషి , తండ్రి చెప్పిన పని కంటే పాల కాయలే ఎక్కువనుకునే పిల్లోడు, తాత తెచ్చి ఇచ్చే మాయా పుల్ల కంటే, జేబులో కమ్మరకడ్డీలు పంచుకుని తినే స్నేహితుడే గొప్ప అనుకునే చిన్నోడు . ఇలా అందరూ తారసపడతారు ఒక సారి కళ్ళు మూసుకుని గుర్తుకు తెచ్చుకోండి. మీరు వెనక వదిలేసిన జ్ఞాపకాల్లో మీ కోసం ఎదురుచూస్తూ ఉంటారు.

You may also like