
Sira
ఎరీనాలో ఇద్దరు అతి శక్తి వంతులైన 'గ్లాడియేటర్స్' ఢీకొంటే ఎంత థ్రిల్ ఉంటుందో కోర్ట్ రూమ్ డ్రామా కూడా అంత థ్రిలింగ్ గా ఉంటుంది అని నా నమ్మకం . స్టాన్లీ గార్డెనర్ నుంచి జాన్ గ్రీషామ్ వరకూ కోర్ట్ డ్రామా బుక్స్, మూవీస్ అన్నీ నాకు ఇష్టం. వాటిలాగే నా నమ్మకం 'కరెక్ట్' అని ప్రూవ్ చేసింది ఈ రాజ్ మాదిరాజు గారి పుస్తకం. ఇంట్రస్టింగ్ యూత్ ఫుల్ బ్యాక్ డ్రాప్ లో .. ఆ ఫేమస్ ఇన్స్టిట్యూట్లో అనుమానంగా అనిపించే కుర్రవాళ్ళ ఆత్మ హత్యలు, వాటి వెనక వున్న రహస్యం ఛేదించాలని సిద్ధపడ్డ యంగ్ లాయర్ రామ్.. తనకెదురుగా కేసు వాదిస్తోంది. ఇండియాలో నెంబర్ వన్ లాయర్, తన గురువు 'మూర్తి సర్......! ఇద్దరు ఇంటిలిజెంట్, స్మార్ట్ లాయర్స్... ఒకరిది టెక్నికల్లో బ్రిలియెన్సు.. ఒకరిది ఎమోషనల్ ఫోర్సు.. ఒకరు ఓటమి తెలియని గురువు.. ఒకరు గెలిచి తీరాలి అనుకునే శిష్యుడు ... కోర్ట్ అనే ఎరీనాలో ఇద్దరూ కసిగా యుద్ధం మొదలు పెట్టారు .... ఈ మేటర్ చాలదూ పుస్తకం చివరివరకు ఆపకుండా చదివించటానికి... హ్యాపీ అండ్ థ్రిల్లింగ్ రీడింగ్.. పి. సత్యానంద్.