
Seethapaharanam
"సీత చచ్చిపోయింది లేదా అపహరించబడింది" అనే మాటతో ఉలిక్కిపడి లేచాను. దూరంగా ఉన్న గుడి దగ్గర లౌడ్ స్పీకర్ల నుంచి రామాయణం వినిపిస్తోంది. రాముడు లక్ష్మణునితో అన్నమాటలు నందన్ మనసుని కుదిపేస్తున్నాయి. నా సీత కనిపించకుండా పోయి రెండు రోజులు అయ్యింది. ఎవరికి ఉంది? సీతను కిడ్నాప్ చెయ్యాల్సిన అవసరం డబ్బు కోసం అయితే ఈ పాటికే ఫోన్ లాంటిది రావాలి... ఇంకేదైనా జరిగి ఉంటే భయం దుఃఖం ఒకేసారి!!!- ఇంకేదైనా జరిగి ఉంటే ఈ పాటికే ఏదో ఒకటి తెలియాలి. నీళా సరస్త ముఖసూరి వరేణ్య గీతి పాత్రం విరాజిత విభీషణ భాగధేయ;" ఒక్కసారిగా కన్నులు ఆ శ్లోకం మీదకు వెళ్లాయి. సీత రూమ్ ఓల్డ్ మ్యాప్లతో నిండి ఉంది. చిన్న కాగితాలు మ్యాప్స్ కి అనుగుణంగా అమర్చి ఉన్నాయి. శ్రీరంగం అన్న చోట పేపర్ మీద రాసి ఉంది ఈ శ్లోకం. శ్రీరంగనాధుణ్ని వర్ణించిన శ్లోకం అని అర్ధం అవుతోంది. అసలు వీటికి సీతకు సంబంధం ఏమిటి? సీతకు శత్రువులు ఎవరైనా ఉన్నారా?? సీత ఏమయ్యింది???