
Saptha Bhoomi - శప్తభూమి
రాయలసీమ - అందులోనూ అనంతపురం జిల్లా పరిధిలో అత్యుత్తమ కథకులు ఉన్నారు. అలాంటివారిలో సన్మిత్రుడు బండి నారాయణస్వామి కూడా ఒకరు. గత మూడు దశాబ్దాలలో స్వామిగారి అనేక కథలను చదివాను. వాటిలోని శైలిశిల్పాలకు, వస్తు వైవిధ్యానికి, రైతాంగం పట్ల ఆసక్తికి ఆశ్చర్యపోయాను. వారి కొన్ని కథలను నావే అన్నట్టు భావించి కన్నడలోకి అనువదించాను. మాంత్రిక వాస్తవికవాద పరంపరకు పునాది వేసిన స్పానిష్ రచయిత మార్క్వెజ్ ను గుర్తుకు తెచ్చేలా రాసేటటువంటి స్వామి అపురూపంగా ‘శప్తభూమి' అనే చారిత్రాత్మక నవల రాశారు. - ఈ నవలలో అనేక గొప్ప పాత్రల వల్ల, ఘటనల వల్ల పద్దెనిమిదవ శతాబ్దపు కథను వర్తమానానికి అలవరుచుకునే కార్యాన్ని రచయిత బండి నారాయణస్వామి అత్యంత నైపుణ్యంతో నిర్వహించారు. ఒక్కమాటలో చెప్పాల్సి వస్తే ఇది రాజు కేంద్రితమైన నవల కాదు. రాజ్యాన్ని కేంద్రంగా చేసుకున్న నవల. ఇది రాయలసీమ చారిత్రక నవల దళిత బహుజన చారిత్రక నవల --డా||కుం.వీరభదప్పు ప్రఖ్యాత కన్నడ రచయిత SapthaBhumi, Sapthabhoomi, Saptabhumi, Sapthabhumi.Shapthabhumi, Shaptha bhumi, Shaptha Bhoomi