Skip to product information
Online Scamulu - Mee Dabbulu Kaapaadukondila
Rs. 100.00
మన విద్యార్హతలు, టెక్నాలజీ పై అవగాహన ఆన్లైన్ స్కామ్స్ నుంచి తప్పించుకోడానికి సరిపోవు. మన మానసిక స్థితి కూడా కీలకమని గుర్తించాలి. అది గుర్తు పెట్టుకుంటే మనం అతీతులం కాదని అర్థమవుతుంది. అప్పుడు ఈ నేరాలకు మనం లొంగకుండా ఏం చేయగలం? మన చేతిలో ఎంత కంట్రోల్ ఉంది? మనం ఎలా ఈ ఎరలను తప్పించుకోగలం? వంటి ప్రశ్నలు పుట్టుకొస్తాయి. వాటి సమాధానాల దిశగా ఆలోచింపజేయాలనే ఈ పుస్తకం రూపుదిద్దుకుంది. శారీరిక ఆరోగ్యానికి ఎలా అయితే పౌష్టికాహారం, వ్యాయామం లాంటివి తప్పని సరో, డిజిటల్ ఆరోగ్యానికి కూడా కొన్ని సూత్రాలుంటాయి. వాటిని తెలుసుకుని, మన నిత్యజీవితంలో భాగం చేసుకోవాలి. ఆ ప్రయత్నాలలో ఈ పుస్తకం కూడా ఎంతో కొంత సహాయ పడితే మా ఈ ప్రయత్నం సఫలమైనట్టే.