
Nede Choodandi
Nede Choodandi: Telugollu, Cinimalu, Oka charitra
1929 అక్టోబరు నెలలో ఎక్కడో అమెరికాలోని న్యూయార్క్ నగరంలో వాల్స్ట్రీట్లో కంపెనీల స్టాక్స్ విలువ కుప్పకూలిపోవడానికీ, ఆ తర్వాత ఏడెనిమిది ఏళ్ళకు కృష్ణాజిల్లా గుడివాడ దగ్గర మారుమూల పల్లెటూరులో వ్యవసాయ కుటుంబానికి చెందిన అక్కినేని నాగేశ్వరరావు అనే కుర్రాడిని అన్న, తల్లి చదువు మానిపించి నాటకాల్లోనూ, తర్వాత సినిమాల్లోనూ పెట్టడానికి లంకె ఉంది. ఇదే కాదు, నటులూ, దర్శకులూ, నిర్మాతలూ, సంగీత దర్శకులూ, రచయితలూ వీరందరూ రూపొందించే సినిమాలూ, వాటిని చూసే ప్రేక్షకులూ - అందరి మీదా చుట్టూ జరుగుతున్న విషయాల ప్రభావం ఉంది, వాటికీ వీటికీ విడదీయరాని సంబంధం ఉంది. సినిమాలన్నా, వాటి వెనుక విశేషాలన్నా విపరీతమైన పిచ్చి ఉన్న నాకు రాజకీయ చరిత్ర నుంచి సామాజిక చరిత్ర వరకూ చదువుకుంటూ పోతున్నప్పుడు ఆ కథలన్నీ ముడిపడడం కనిపించింది. వీటి మీద పుస్తకం ఎవరైనా రాస్తే బావుణ్ణనీ అనిపించింది. కానీ, తెలుగు సినిమా చరిత్ర మీద తెలుగులో అలాంటి పుస్తకాలు పెద్దగా దొరక్కపోవడంతో ఆ పుస్తకాన్ని నేనే రాయడం మొదలుపెట్టాను. ఆసక్తికే ఆసక్తి పుట్టించే ఈ సంగతులన్నీ ముడివేస్తూ తెలుగు సినిమా చరిత్రగా ఈ "నేడే చూడండి" రాశాను. నేడే చూసెయ్యండి... సారీ, చదివెయ్యండి మరి. నేడే చూడండి | Nede Chudandi | Nede Choodandi | నేడేచూడండి