
Meka Bathuku
మీరీ పుస్తకాన్ని చదవరు. మీ కళ్ళముందు మీరెప్పుడూ కనని, వినని కొత్త జీవితాన్ని చూస్తారు. ఇంతకంటే నరకం ఇంకేం ఉంటుందని మీరు ఏడుస్తారు. మీకు ఆకలి విలువ తెలుస్తుంది. నీటి విలువ తెలుస్తుంది. మీకు మాట విలువ తెలుస్తుంది. మనిషి విలువ తెలుస్తుంది. ప్రాణం కంటే విలువైనది ఈ భూమ్మీద ఇంకేం లేదని తెలుసుకున్నాక, మీరు ఘోర సమస్యలనుకుంటున్నవన్నీ గోరంతవే అన్న సత్యం బోధపడ్డాక, మీరీ పుస్తకాన్ని మూసి – ఆ కథానాయకుడికీ, ఆ కథారచయితకీ కృతజ్ఞతలు చెప్తారు. గ్యారంటీ! మలయాళంలో వందకుపైగా పునర్ముద్రణలు పొంది చరిత్ర సృష్టించిన పుస్తకం. ఏడు భాషల్లోకి అనువాదమై, ప్రపంచవ్యాప్తంగా మూడు లక్షల కాపీలు అమ్ముడైన సంచలన పుస్తకం. ఐదు భాషల్లో రిలీజై 150 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాకి కథను అందించిన పాపులర్ పుస్తకం. అదే- బెన్యామిన్ రాసిన 'ఆడు జీవితం'! కేరళ సాహిత్య అకాడమీ అవార్డు, జేసీబీ ప్రైజ్, అబూదాబి శక్తి అవార్డులు అందుకున్న పుస్తకం. జోసెఫ్ కోయిపల్లి ఇంగ్లీషులో 'గోట్ డేస్' గా అనువదించిన ఈ పుస్తకానికి తెలుగు అనువాదమే ఈ 'మేక బతుకు'. "Meka Batuku" is the translated version of the acclaimed Malayalam novel "Aadujeevitham" (Goat Days) by Benyamin. This powerful story follows Najeeb Muhammed, an Indian migrant worker forced into a life of servitude as a goatherd in the Saudi Arabian desert. Based on true events, the novel depicts Najeeb's harrowing journey from hopeful emigrant to virtual slave, and his daring quest for freedom. A bestseller in its original language, this universal tale of survival, loneliness, and resilience has garnered international recognition and numerous literary accolades.