Skip to product information

Kshanikaalu
Rs. 150.00
Kshanikaalu | Of lights and lives
by Dheeraj Kashyap Vemuganti
లోపమో కోపమో సౌఖ్యమో మోహమో ఎంత సౌందర్యం అనుకోగల మనిషిని ఇప్పటి ప్రపంచపు తూనికరాళ్ళతో భోగి అనడం తేలికైన పని. కానీ, విడదీయలేని ముడులతో చిక్కుబడ్డ జీవితానుభవాలన్నింటినీ, తనవైన ప్రశ్నలతో తరచి చూసుకునే శోధకుడి అంతరంగం నిజానికి అంత తేలిగ్గా పట్టుబడదు. అట్లాంటి అంతరంగపు చీకటి దారుల్లోకి వెలుతురు వాలిన క్షణాలే ఈ క్షణికాలు . ప్రేమలు పోగొట్టుకున్న నగరంలో పావురాళ్లకు స్నేహమిచ్చే హైదరాబాదీ యవ్వనమూ, ఇరానీ కేఫ్ లో సాయంకాలాలను తాగేసి లక్కీ అలీ గొంతు నుండి వయొలిన్ నొప్పి వేరుపడడం చూడగల ఏకాంతమూ, ఈ రెంటినీ సమన్వయపరుచుకునే ప్రయత్నమూ...అందులోని జీవితమూ...
- మానస చామర్తి