Skip to product information
Final Diagnosis
1/2

Final Diagnosis

Rs. 225.00

“ఫైనల్ డయాగ్నోసిస్” - ఒక్క ఉత్తరంతో ప్రారంభమై, జీవన మరణాల మధ్య సాగే సాహసోపేతమైన ప్రయాణం! తన సాధారణ జీవితం ఒక్క క్షణంలో తలకిందులవుతుందని సారథి కలలో కూడా ఊహించలేదు. మొబైల్ ఫోన్స్, ఈ మెయిల్స్ రాజ్యమేలుతున్న ఈ కాలంలో తన అక్క దగ్గర్నుంచి ఉత్తరం రావడంతో సారథి ఆశ్చర్యపోతాడు. తన భర్తకు మరొకామెతో పెళ్లి చేయాలనుకుంటున్నాని అక్క రాసిన ఉత్తరంలోని విషయం చదివి కంగారు పడతాడు. ఇదంతా ఏంటో తెలుసుకుందామని అక్కను కలుసుకోడానికి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లి అక్కడ అక్క హాస్పిటల్లో బెడ్ మీద ఉండడం చూసి భయపడతాడు. కానీ కొన్ని రోజుల్లోనే అక్క బావ హాస్పిటల్ నుంచి మిస్ అవడంతో ఆందోళనకు గురవుతాడు. తన అక్క, బావ ఏమయ్యారు? అక్క హాస్పిటల్లో ఎందుకు చేరింది? తన అక్క మిస్ అయిన విషయం అమెరికాలో ఉన్న తన తల్లిదండ్రులకు తెలియకుండా ఎన్ని రోజులు ఆపగలడు? ఉత్కంఠ, రహస్యం, భావోద్వేగం - ఇవన్నీ సమపాళ్ళలో మేళవించి, ఒక బెస్ట్్సల్లర్కు కావలసిన అన్ని లక్షణాలను కలిగి ఉన్న మెడికల్ థ్రిల్లర్ - “ఫైనల్ డయాగ్నసిస్.” ప్రతి పేజీ మీ గుండెల్లో ఉత్కంఠను రేకెత్తిస్తుంది. ప్రతి అధ్యాయం మిమ్మల్ని మరింత లోతుగా రహస్యాల వలలోకి లాగుతుంది. ఈ థ్రిల్లర్ నవల పాఠకులను ఒక రహస్య ప్రపంచంలోకి తీసుకెళ్తుంది, వారి గుండెల్లో భయాన్ని రేకెత్తిస్తుంది మరియు చివరి పేజీ వరకు వారిని ఉత్కంఠభరితులను చేస్తుంది.

You may also like