Dimki
Dimki (Telugu) Paperback
నేను పుట్టిన నేల, నాకు అనుభవంలోకి వచ్చిన కొన్ని సంఘటనలు, నా జీవన ప్రయాణంలో నాకు తారసపడిన వ్యక్తులు, లోతుగా పరిశీలించిన కొన్ని కోణాలు నేను రాయాల్సిన అవసరాన్ని తెలిపి నా చేత రాయించినవే ఈ కథలు.
సాహిత్యం సమాజాన్ని కచ్చితంగా ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది. కథలు, నవలలు చదివి తమ సమస్యకు పరిష్కారం వెతుక్కునే వాళ్లు కొందరైతే, ఆ పాత్రలలో తమని చూసుకుని ఎమోషనల్ అయ్యే వాళ్ళు కొందరు. తెలియని విషయాలను గురించి తెలుసుకునేవాళ్ళు కొందరైతే, తెలిసిన విషయాన్నే వాళ్లకు తెలియని కొత్త కోణంలో తెలుసుకుని వాళ్ళ ఆలోచనా ధోరణిని మార్చుకునేవాళ్ళు కొందరు. అటువంటి మార్పులు తీసుకొచ్చిన కథలు, నవలలు కోకొల్లలు.
మన రచన మొత్తం సమాజాన్నే మార్చేయలేకపోవొచ్చేమో కానీ దాన్ని చదివే ఏ ఒక్కరినైనా కదిలించగలగి, ఒక ఆలోచనను రేకెత్తించగలిగి, ఆ ఆలోచనే రేపటి మార్పుకు పునాది కావాలి. ఒక రచయిత అక్షరానికి అంతకంటే గొప్ప గుర్తింపు, గౌరవం మరేదీ ఉండదని నా నమ్మకం.
-స్ఫూర్తి కందివనం
రచయిత్రి