
Charminar Kathalu
PARAVASTHU LOKESHWAR CHARMINAR KATHALU SHORT STORIES
అప్పటికి హైద్రాబాద్ సంస్థానం పై పోలీస్ యాక్షన్ జరిగి మూడు సంవత్సరాలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి నాలుగు సంవత్సరాలు. దేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగింది కూడా అదే సంవత్సరం. యాఖుత పురా రైల్వే స్టేషన్ దగ్గరి రైన్ బజార్ పుట్టి పెరిగి ఐదో తరగతి కామ్యాఐన అమ్మకు గాంధీ, నెహ్రూ, పటేల్ అంటే దేవుండ్లతో సమానం. అట్ల ఏడుపదుల క్రింద ఆఖరి నిజాం నవాబ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహద్దూర్ మూసీనది తీరాన కట్టించిన ఉస్మానియా సర్కారీ దవాఖానాల నేను కండ్లు తెరిచి ఈ భూమ్మీదపడిన. చందమామ కథల పత్రిక నుండి విశ్వనాథ నవలల వరకూ చదివే మా అమ్మకు నా పేరు ఖరారు లక్ష వరహాల సమస్యగా మారింది. అరుదైన అపురూపమైన పేరు పెట్టాలని ఆమె ఆలోచన. దాదాపు సంవత్సరం కావొస్తున్నా సరిఐన పేరే ఆమెకు ఇంకా దొరకలేదు. పిల్లల పేర్లు తల్లితండ్రుల సంస్కారానికి ప్రతిరూపాలు.