
Chaitra (Novel)
కాలం ఎప్పటికప్పుడు కొత్త రంగులను తొడుక్కుంటూనే ఉంది, రోజులన్నీ తేదీలను మారుస్తూ అభివృద్ధి వైపు అడుగులేస్తూ పోతున్నా, ఆధునిక యుగంలో ఇంకా అనాగరికంగానే బతుకుతున్నాం, విచక్షణ కోల్పోయి, వివక్ష తాలుకా మనిషి నిలబడ్డప్పుడు కొన్ని మనుగడలెప్పుడూ మనిషిని వేధిస్తూ ఉంటాయి, మనం ఆనవాళ్ళుగా చెప్పుకునే అమ్మల జీవితాలు ఏ గర్భగుడిలోనో హత్య చేయబడతాయి, ఏ చెత్త కుప్పల మీదో అనాథగా వెలేయబడతాయి. భారం దించుకొని, బాధ్యతగా చెప్పుకునే ఓ తాడుకి ఉరితీయబడుతున్నాయి ఇలా ఒకే కారణం మీద వేలాడుతూ దుఃఖిస్తూ ఉన్నాయి. అయినా కాలంతో పాటు కాసిన్ని కలలతో జీవితాన్ని కలగంటున్నవారు విరిగిన రెక్కలను అతికించుకుంటూ కొత్త రంగులను జీవితానికి అద్దుతున్నారు. ఇంటి గడపల ముందు ఎదురుచూపులు మాని దేశ సరిహద్దుల మీద కాపలా కనురెప్పలవుతున్నారు. కంచెలు తెంచుకొని కాలం మీద చరిత్రలు రాస్తున్నవారు మనకు కనిపిస్తూనే ఉంటారు… నా ఆలోచనలకు అక్షరాలను అద్ది అస్థిత్వపు నినాదంగా నా మొదటి నవల 'చైత్ర'ను మీకు అందిస్తున్నాను. -స్ఫూర్తి కందివనం