
Aadavari Matalaku...
Aadavari Matalaku... - A Collection of Poems by Kadali
కొన్ని మనం గుర్తుపెట్టుకోవాలనుకొని గుర్తుపెట్టుకున్న సంగతులు, కొన్ని గుర్తుపెట్టుకోవాలని అనుకొని కూడా తెలియకుండా మర్చిపోయే విషయాలు. గుర్తుండిపోయేవి, అప్పుడప్పుడూ గుర్తొచ్చేవి, వదిలించుకున్నవి, వదల్లేనివి, నీవి, నావి, మనందరివీ ఈ వివరాలు. ఓ రోజు ఏ విషయాన్ని అస్సలు పట్టించుకోకుండా వదిలేస్తామో, అదే విషయం ఇంకో రోజున తెగ హింస పెడుతుంది. నిన్న బాగా నచ్చిన ఏదో సంగతి ఈ రోజుకి చిరాకు పుట్టిస్తుంది. ఈ రోజు అంత అసహ్యం కలిగించిన అదే సంగతి రేపు బతకడానికి ఆశని కలిగిస్తుంది. అవన్నీ పోగేసి మూట కట్టి ఇదిగో ఇలా మీ చేతికిచ్చాను. కొన్ని మర్చిపోయినా పర్వాలేదు, కొన్నింటిని మాత్రం గుండెకి ఎంత దగ్గరగా వీలైతే అంత దగ్గరగా హత్తుకోండి. ఈ రోజు కాకపోయినా రేపటి రోజున ఖచ్చితంగా అవసరం పడొచ్చు. మీరు ఆగి- ప్రపంచం కదులుతోందో, మీరు కదిలి- ప్రపంచం ఆగిపోయిందో తెలుసుకున్న రోజున ఈ పుస్తకం మీకు గుర్తొస్తుంది. అప్పుడు తీరిగ్గా మాట్లాడుకుందాం.